- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో కొత్త సినిమాకు మంచు విష్ణు గ్రీన్ సిగ్నల్.. ఎవరితో అంటే?
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ( Manchu vishnu) మంచి ఊపులో కనిపిస్తున్నాడు. రెండు రోజుల కిందట కన్నప్ప సినిమాతో (Kannap

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ( Manchu vishnu) మంచి ఊపులో కనిపిస్తున్నాడు. రెండు రోజుల కిందట కన్నప్ప సినిమాతో (Kannappa Movie) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు విష్ణు..మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ప్రభుదేవా (Prabhu Deva) లాంటి కొరియోగ్రాఫర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. ఆయన దర్శకత్వంలో సరికొత్త సినిమా చేయబోతున్నారట మంచి విష్ణు.
ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా ఫినిష్ అయినట్లు చెబుతున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నారట ప్రభుదేవా. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభుదేవానే కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు... మంచు విష్ణు తో కొత్త ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడట ప్రభుదేవా. ఇది ఇలా ఉండగా... మంచు విష్ణు హీరోగా చేసిన కన్నప్ప రెండు రోజుల కిందట రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. రెండు రోజుల్లోనే 42 కోట్లు దాటాయి కన్నప్ప కలెక్షన్స్. ఇక ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక కాంచన ప్రకారం మూడు రోజుల్లో 60 కోట్లు దాటుతుందని అంటున్నారు.






