సెలైన్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉన్న మంచు లక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi)స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది.

సెలైన్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉన్న మంచు లక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi)స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. ఇక మంచు లక్ష్మీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా పలు వివాదాస్ప పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే ఫన్నీ రీల్స్‌లో చిక్కుల్లో పడింది. అలాగే ఇటీవల ఓ యాంకర్‌పై ఫైర్ అయింది. అంతేకాకుండా నటీనటుల గురించి తప్పుగా మాట్లాడిన ఆ వ్యక్తిపై చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. చాలా రోజుల తర్వాత ఇటీవల ‘దక్ష’(Daksha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ప్రత్యేక పాత్ర పోషించారు. యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, సముద్రఖని, 'రంగస్థలం' మహేష్, మలయాళ నటుడు సిద్ధిఖీ కీలక పాత్రలు కనిపించారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. ఇది క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో సెలైన్ పెట్టుకుని బెడ్‌పై పడుకున్న ఫొటోలు షేర్ చేయగా.. మోహన్ బాబు ఆమె పక్కన కూర్చొని కనిపించారు. దీంతో అది చూసిన నెటిజన్లు సడెన్‌గా ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు.కానీ అవి ‘దక్ష’ సినిమా స్టిల్స్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన క్యాప్షన్ ద్వారా వెల్లడించింది. తన తండ్రితో నటించడంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే.. మీతో కలిసి ‘దక్ష’ సినిమా నిర్మించి, నటించే అవకాశం వచ్చిన తర్వాత మీతో కలిసి పనిచేయడం నిజంగా నా కల నిజమైంది. ధన్యవాదాలు! మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి నాన్న’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నువ్వు ఇచ్చిన ట్విస్ట్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story