మంచు మనోజ్, విష్ణు గొడవలపై అసలు సీక్రెట్ బయట పెట్టిన మంచు లక్ష్మీ?

by Dishanational2 |
మంచు మనోజ్, విష్ణు గొడవలపై అసలు సీక్రెట్ బయట పెట్టిన మంచు లక్ష్మీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్నిరోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ చాలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యాయని, ఇద్దరికీ పడటం లేదంటూ చాలా వార్తలు వైరల్ గా మారాయి. కానీ కొందరు, అవి రూమర్సే అని కొట్టి పారేస్తే మరికొందరు ఆ వార్తలు నిజమే అంటూ నమ్ముకొచ్చారు. కానీ దేనిపై క్లారిటీ లేదు.

అలాంటి సమయంలో విష్ణు గొడవకు వచ్చండంటూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు నిజమేఅని అందరూ భావించారు. కానీ ఇది ఫ్రాంక్ వీడియో అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. కానీ వారిమధ్య గొడవలు నిజమే అంటూ ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.

కాగా, తాజాగా మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. మంచు బ్రదర్స్ గొడవలపైనే ఆమె పోస్టు పెట్టింది, ఇప్పటికీ మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయని కొందరు ముచ్చటిస్తున్నారు.

అసలు మంచు లక్ష్మీ ఏం పోస్టు చేసిందంటే? మీరు ఒకరితో వాదించే ముందు అసలు వాళ్లకు ఆ విషయం మీద పూర్తి క్లారిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి..అంతేకాదు చాలా కోణాల్లో వారికి దాన్ని చూడగల పరిజ్ఞానం ఉందా లేదా అని ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.ఒకవేళ వాళ్లకు ఆ పరిజ్ఞానం లేకపోతే మనం వారితో ఎంత వాదించిన ఉపయోగం అనేది ఉండదు అంటూ మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ప్రస్తుం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూంది.

ఇవి కూడా చదవండి: Akhil: అఖిల్ బర్త్‌డే స్పెషల్.. ‘ఏజెంట్’ నుంచి బ్లాస్టింగ్ పోస్టర్!

Next Story

Most Viewed