బెలూన్స్ అమ్ముకునే కుర్రాడి ప్రేమ కథ..

by Vinod kumar |   (  Updated:2023-02-14 14:16:42  IST  )

పార్వతీశం, జ‌ష్విక జంట‌గా న‌టించిన న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరీ 'తెలుసా మనసా'.

బెలూన్స్ అమ్ముకునే కుర్రాడి ప్రేమ కథ..
X

దిశ, సినిమా: పార్వతీశం, జ‌ష్విక జంట‌గా న‌టించిన న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరీ 'తెలుసా మనసా'. కాగా, ఈ సినిమా నుంచి 'మనసు మనసుతో..' మెలోడీని విడుదల చేశాడు స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్.. మ‌రోసారి ఈ పాట‌తో త‌న‌దైన మార్క్ చూపించారు.

వ‌న‌మాలి రాసిన ఈ పాట‌ను శ్రీకృష్ణ అద్భుతంగా ఆల‌పించగా.. ప్రసాద్ ఈద‌ర సినిమాటోగ్రఫీ మ‌రింత అందాన్నిచ్చింది. ఇక న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరీగా వస్తున్న చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించగా.. వైభ‌వ్ ద‌ర్శకత్వం వహించాడు. ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు, హెల్త్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్న అమ్మాయికి మధ్య చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. కానీ ఆ లవ్‌ను వ్యక్తపరిచేందుకు మొహమాటపడుతుంటారు. ఈ క్రమంలో వీరిద్దరు ఎలాంటి కారణాలతో దూరమయ్యారు? మళ్లీ కలుసుకున్నారా లేదా? అనేది ఈ కథ.

Next Story