కర్రసాముతో అదరగొట్టేసిన మాళవిక.. నెటిజన్లు ఫిదా

by Disha Web Desk 10 |
కర్రసాముతో అదరగొట్టేసిన మాళవిక.. నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మాళవిక మోహనన్‌ కర్రసాముతో అదరగొట్టేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ లుక్‌తో సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తన అందాలతో కట్టిపడేసే నటి.. తాజాగా కర్రసాము చేస్తూ అలరించింది. ఈ మేరకు బ్లాక్ కలర్ స్పోర్ట్స్ ప్యాంట్, టాప్ ధరించిన ఆమె తను ఉంటున్న అపార్ట్‌మెంట్ గార్డెన్‌లో కసరత్తులు చేస్తూ ఆకట్టుకుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను రమేష్ బాలా అనే సెలబ్రిటీ నెట్టింట షేర్ చేస్తూ.. ‘@MalavikaM practices Silambam. a form of Indian martial art which originated in Tamil Nadu’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. విక్రమ్‌ నటిస్తోన్న తమిళ్‌ మూవీ ‘తంగలాన్‌’ కోసమే ఆమె ఈ ప్రాక్టీస్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటికే మళవికను డీగ్లామరైజ్‌డ్‌గా చూపించబోతున్నట్టు స్టన్నింగ్ స్టిల్‌తో డైరెక్టర్ పా రంజిత్‌ క్లారిటీ ఇచ్చేయగా మూవీకోసమే కర్రసాము నేర్చుకుంటుందని నెటిజన్లు పక్కాగా చెప్పేస్తున్నారు.

Next Story

Most Viewed