- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ‘మండాడి’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. అడ్రినల్ తుఫాన్ రాబోతుందంటూ పోస్ట్
‘మండాడి’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. అడ్రినల్ తుఫాన్ రాబోతుందంటూ పోస్ట్
by Mallepaka Hamsa |
ఓడ బయలుదేరింది... మీ వైపు అడ్రినలిన్ తుఫానును మోసుకొస్తూ! మండాడి షూట్ పూర్తయింది.

X
దిశ, సినిమా: టాలెంటెడ్ నటుడు సుహాస్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, ఇప్పుడు ‘మండాడి’ అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తిగా తీర ప్రాంతం మత్స్యకారుల జీవనశైలి నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. చుట్టూ సముద్రం, అలల మధ్య సాగే ఈ కథలో ఎంతో భావోద్వేగం, పోరాటం ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. షూటింగ్ పూర్తయిన సందర్భాన్ని మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. "ఓడ బయలుదేరింది... మీ వైపు అడ్రినలిన్ తుఫానును మోసుకొస్తూ! మండాడి షూట్ పూర్తయింది" అని రాసుకొచ్చారు.
Next Story






