బిగ్ షాకిచ్చిన మహేష్ బాబు హీరోయిన్.. బేబీ బంప్ వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-14 06:17:07  IST  )

స్టార్ హీరోయిన్‌ ఇలియానా(Ileana) ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే.

బిగ్ షాకిచ్చిన మహేష్ బాబు హీరోయిన్.. బేబీ బంప్ వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్‌ ఇలియానా(Ileana) ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు(Mahesh Babu), ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఆమె.. కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో రాణించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తన భర్తను మాత్రం చూపించకుండా జాగ్రత్త పడింది. కొద్ది కాలం తర్వాత ఆమె తన బిడ్డతో పాటు భర్తను అందరికీ చూపించింది. ఇక ఈ ఏడాది జూన్ 19న తన రెండో బిడ్డను కూడా పరిచయం చేసింది. దీంతో అంతా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందని భావించారు.

ఈక్రమంలో.. తాజాగా, ఇలియానా అందరికీ బిగ్ షాక్ ఇస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇలియానా మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ ఉయ్యాలా సెట్ చేస్తున్న వీడియోను షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అలాగే నా కొత్త ప్రాణ స్నేహితుడు రాబోతున్నాడు అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

READ MORE ......

బిగ్‌బాస్-9: అతను అమ్మాయిల పిచ్చోడు.. నా జోలికి వస్తే తొక్కుతా అంటూ పికిల్స్ పాప సంచలన కామెంట్స్ (వీడియో)

Next Story