Madhumitha: మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన హీరో భార్య.. వీడియో వైరల్

by Disha Web Desk 10 |
Madhumitha: మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన హీరో భార్య.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : నటుడు శివ బాలాజి భార్య, నటి మధుమిత మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను తమదైన స్టైల్‌లో అలరిస్తోన్న ఈ జోడీ.. మరోసారి వార్తల్లో నిలిచింది. విషయానికొస్తే.. తాజాగా ఓ పార్టీలో వీరిద్దరూ కలిసి సమంత నటించిన చార్ట్ బస్టర్ సాంగ్ 'ఊ అంటావా మావా' పాటకు మాస్ స్టెప్పులేస్తూ తెగ హంగామా చేశారు. ముఖ్యంగా వైట్ కలర్ షార్ట్‌ గౌన్‌లో మధుమిత వేసిన స్టెప్పులు జనాలను మత్తెక్కించాయి. అచ్చం మద్యం మత్తులో ఉన్నట్లే నటిస్తూ భర్తతో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. 'మధు నీకు వయసే పెరగదా? ఇంకా 20ఏళ్ల అమ్మాయిలాగే ఉన్నావ్' అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed