- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకి రెట్ట వేయడానికి కూడా మీరు పనికిరారు.. మగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత
అన్నీ అయిపోయాయా? ఇక మళ్ళీ ఎప్పటిలాగే రొటీన్ రోజులు మొదలవుతాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మాధవీలత సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, పురుషాధిక్య ధోరణిపై ఆమె చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. మగాళ్ల మనస్తత్వంపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపుతున్నాయి. పండుగలు, వేడుకలు ముగిసిన తర్వాత మళ్ళీ సాధారణ రోజులు మొదలయ్యాయని చెబుతూ మాధవీలత తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘అన్నీ అయిపోయాయా? ఇక మళ్ళీ ఎప్పటిలాగే రొటీన్ రోజులు మొదలవుతాయి.
మీకు నచ్చినట్లు ఆడవాళ్లను తొక్కేయొచ్చు.. హింసించొచ్చు’’ అంటూ ఆమె నేరుగా పురుష సమాజాన్ని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు కూడా ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో తనను 'మెన్ హేటర్' (మగాళ్లను ద్వేషించే వ్యక్తి) అని పిలిచే వారిపై ఆమె విరుచుకుపడ్డారు. ‘‘కొంతమంది కామెంట్స్ చేస్తారు.. నీకు మగాళ్లంటే పరమ చిరాకు అని. మళ్ళీ వాళ్లే నిన్ను ఎవరో ఒకరు పోషించడానికి ఉంటారులే అని అంటారు. నేను మగాళ్లను ద్వేషిస్తానని చెబుతూనే, మళ్ళీ నన్ను పోషించడానికి ఒక మగాడు కావాలని అనడంలో మీ అర్థం ఏంటి? అంటే ఆడది ఎప్పుడూ మగాడి కాళ్ల కిందే బతకాలని మీ ఉద్దేశమా?’’ అని మాధవీలత నిలదీశారు.
ఏ ఒక్క మగాడికి ఆడదాని గురించి మాట్లాడే హక్కు కానీ, అర్హత కానీ లేవని ఆమె తెగేసి చెప్పారు. మగాళ్ల గురించి మరీ దారుణంగా మాట్లాడింది. ‘‘ప్రతి ఒక్క మగాడు గురివింద గింజ లాంటి వాడే. మీ మొహం మీరు అద్దంలో చూసుకుంటే, ఒక కాకి కూడా మీ మీద రెట్ట వేయడానికి మీరు పనికిరారు’’ అంటూ విమర్శించారు. మగాళ్లందరూ తమ తప్పులను పక్కన పెట్టి ఆడవాళ్లను తక్కువ చేసి చూడటంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు ఆమె మాటలను సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలు మరీ అతిగా ఉన్నాయని మండిపడుతున్నారు.






