- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా హృదయానికి దగ్గరగా ఉన్న కొత్త ప్రారంభం స్టార్ట్ చేశానంటూ లారెన్స్ పోస్ట్.. దేని గురించంటే?
హీరో, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

దిశ, సినిమా: హీరో, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమందికి అండగా ఉంటూ అందరి హీరోలకంటే భిన్నంగా సమాజ సేవలో లీనమై ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో చేసిన రాఘవ ఇక ఇప్పుడు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. పేద ప్రజలకు రుచికరమైన భోజనం అందించడానికి తన తల్లి కణ్మణి అన్నదాన విందు పేరుతో ఓ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ‘‘కన్మణి అన్నదాన విరుంధు ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా. ఈ కార్యక్రమానికి కన్మణి అన్నదాన విరుంధు అని నా తల్లి పేరుతోనే పెట్టాం.
దనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే నా లక్ష్యంగా భావించి ఇది ప్రారంభించాను. ఆహారం ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు. అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి. పిల్లలు, పెద్దలతో కలిసి నారి కురువర్గల్ సంఘంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి ప్రేమ అశీర్వాదాలతో, అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






