- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాల్లోకి లలిత జ్యూవెలరీ ఎండీ కిరణ్.. క్లారిటీ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యువెలరీ షో రూమ్‌లు ప్రారంభించి.. బిజినెస్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎండీ కిరణ్ కుమార్.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యువెలరీ షో రూమ్‌లు ప్రారంభించి.. బిజినెస్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎండీ కిరణ్ కుమార్. ‘డబ్బులు ఎవరికి ఊరికే రావు’ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇటీవలే ఈయన కర్నూల్‌లో మరో షో రూంను ప్రారంభించారు. ఈ షోరూం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం స్టార్ట్ చేసిన షోరూం 51వ షోరూం. నా షాపులోకే వచ్చి బంగారం కొనాలని ఎవరినీ అడగను. నచ్చితేనే కొనండి. కాకపోతే దేశవ్యాప్తంగా నా షోరూమ్స్ విస్తరింపజేయాలన్నదే నా కోరిక’’ అంటూ కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి కదా? అవి ఎంతవరకూ నిజమని ప్రశ్నించగా.. ‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. ‘‘రాజకీయాల్లోకి రాను. సినిమాల్లోకి కూడా రాను. నాకు ఈ జన్మకు ఈ బిజినెస్ ఫీల్డ్‌లోనే కొనసాగుతాను.’’ అని లలిత జ్యువెలరీ ఎండీ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






