సమంత బాటలో కృతి శెట్టి.. ఇక కోట్ల వర్షమే?

by velandi.Saikiran |

సమంత తరహాలో... కొత్త బాట ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసి... విడాకుల కృతి శెట్టి

సమంత బాటలో కృతి శెట్టి.. ఇక కోట్ల వర్షమే?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలియని వారు ఉండరు. ఉప్పెన సినిమాతో మంట పెట్టిన ఈ అందాల తార.... ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే.. 2021 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కృతి శెట్టి... ఉప్పెన సినిమా తర్వాత మళ్లీ పెద్ద హిట్ అందుకోలేదు.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన ఈ అందాల తార నటించి, మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అదృష్టం బాగా లేక సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ పర్వాలేదనిపించిన మిగిలిన సినిమాలు నిరాశే మిగిల్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కృతి శెట్టి పెద్దగా అవకాశాలు రావడం లేదు. గత సంవత్సరం మనమే సినిమాతో మెరిసిన ఈ బ్యూటీ మళ్ళీ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయలేదని సమాచారం. పూజా హెగ్డే తరహాలో ఈమె కెరీర్ కూడా... ముగుస్తుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో సమంత తరహాలో... కొత్త బాట ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసి... విడాకుల తర్వాత టాప్ మోస్ట్ హీరోయిన్ గా మళ్లీ మారిపోయారు. ఇక ఇప్పుడు కృతి శెట్టి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటున్నారట. ఒకే ఒక్క ఐటెం సాంగ్ చేసి... మళ్లీ సక్సెస్ బాటలో పడాలని భావిస్తున్నారట. స్టార్ హీరోల సరసన ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోకూడదని అనుకుంటున్నారట. హీరోయిన్ గా అవకాశం రావాలంటే... ఐటెం సాంగ్ చేయాల్సిందే అని ఆమె డిసైడ్ అయ్యారట. ఈ ఫార్ములా సక్సెస్ అయితే.. కచ్చితంగా కృతి శెట్టికి కోట్ల వర్షం కురవడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.


Next Story