- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ హీరోలంతా స్పీడ్ పెంచేశారు. వాళ్ల మార్కెట్ తో , పక్క ఇండస్ట్రీ మార్కెట్ వైపు కూడా ఓ కన్నేశారు. మొదట్లో మన సినిమాలకు పోటీ ఇవ్వలేకపోయారు.. అలాగే వాళ్లకి అప్పట్లో అంత మార్కెట్ కూడా లేదు. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మన హీరోలతో సమరానికి సై అంటున్నారు. బీస్ట్ , వాలిమై సినిమాలు మన వాళ్లకి గట్టి పోటీనిచ్చాయి. సూర్య , కార్తీ , ధనుష్ , రజిని కాంత్.. వీరికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ హీరోస్ వాళ్ల దగ్గరే కాకుండా మన దగ్గర కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్లకు తమిళ సినిమాలు నచ్చడంతో వారిని ఆదరిస్తున్నారు. కానీ కోలీవుడ్ ప్రేక్షుకులు మన హీరోలను ఆదరించడం లేదు ? లోపం దేనిలో ఉందనేది ఇంకా తెలియలిసి ఉంది. ఈ లోపు మన హీరోల మార్కెట్‌ను మొత్తం కోలీవుడ్ హీరోలు కొట్టేస్తున్నారు. ఇలా అయితే ముందు ముందు మన తెలుగు హీరోల మార్కెట్ పడి పోయిన ఆశ్చర్యపోవాలిసిన అవసరం లేదు.






