పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కోలీవుడ్ హీరో.. ‘ఆర్యన్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్(Vishnu Vishal) ఏకంగా ఆరు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కోలీవుడ్ హీరో.. ‘ఆర్యన్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్(Vishnu Vishal) ఏకంగా ఆరు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విష్ణు విశాల్ నటిస్తున్న సినిమాల్లో ‘ఆర్యన్’ (Aaryan)ఒకటి. ప్రవీణ్(Praveen) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని ఆర్యన్ రమేష్, సుబ్రా సమర్పణలో విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. ‘ఆర్యన్’లో విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో విష్ణు విశాల్ గన్ పట్టుకుని కూర్చొని ఉండగా.. చుట్టూరా మాస్క్ ధరించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. పోస్టర్‌లో.. ‘‘పర్‌ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్.. ఓ హత్య కేసులోని నేరగాళ్లను పట్టుకోగలడు. రేపు ఫస్ట్ క్లూ ఇవ్వబోతున్నాం’’ అని రాసుకొచ్చారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story