మిస్టరీ, థ్రిల్స్‌తో ‘కిష్కింధపురి’ భయపెట్టేందుకు వస్తుంది.. పవర్ ఫుల్ పోస్టర్‌ షేర్ చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-09 15:24:34  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

మిస్టరీ, థ్రిల్స్‌తో ‘కిష్కింధపురి’ భయపెట్టేందుకు వస్తుంది.. పవర్ ఫుల్ పోస్టర్‌ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. త్వరలో హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’(Kishkinda Puri) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, చిత్రబృందం ‘కిష్కింధపురి’ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మిస్టరీ, థ్రిల్స్‌తో సెప్టెంబర్ 12న ‘కిష్కింధపురి’భయపెట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ లుక్‌ను విడుదల చేసి అంచనాలు పెంచారు.

Next Story