- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మార్క్’ మూవీలో యంగ్ బ్యూటీ.. మస్త్ మలైకా వచ్చేస్తుందంటూ బిగ్ అప్డేట్ ఇచ్చిన కిచ్చా సుదీప్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మార్క్’(Mark).

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మార్క్’(Mark). ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను విజయ్ కార్తికేయ (Vijay Karthikeya)తెరకెక్కిస్తు్న్నారు. సుదీప్ కెరీర్‌లో ఇది 47వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో సుదీప్ అజయ్ మార్కండేయ పాత్రలో కనిపించనుండగా..విక్రాంత్, నవీన్ చంద్ర,యోగిబాబు, గురు సోమసుందర్ రోహిణీ ప్రకాష్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుదీప్ సరసన దీప్షిక హీరోయిన్‌గా కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు చిత్రబృందం వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు.
తాజాగా, కిచ్చా సుదీప్ బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ నవిష్క నాయుడు జాయిన్ అయినట్లు తెలిపాడు. ఈ భామ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘మార్క్’ సినిమాకు సంబంధించిన ‘మస్త్ మలైకా’ సాంగ్ డిసెంబర్ 15న సాయంత్రం 3:30 గంటలకు విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు.. ‘‘నా ప్రియమైన బాద్‌షాలారా ‘మార్క్’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన డ్యాన్స్ నెంబర్ రాబోతుంది సిద్ధంగా ఉండండి. సాన్వి పాడిన మొదటి పాట ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండే నవాష్ అజీజ్‌తో కలిసి పాడింది. గొప్ప వ్యక్తి అజనీష్ లోక్‌నాథ్ అద్బుతంగా సంగీతం అందించారు. నా వేలు పట్టుకోవడం నుండి మైక్ పట్టుకోవడం వరకు... ఎల్లప్పుడూ నీ గురించి గర్వపడుతున్నాను సాన్వి’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక పోస్టర్‌లో మాస్ స్టెప్ వేస్తూ కనిపించిన సుదీప్ పక్కన.. నవిష్క నాయుడు అరుస్తున్నట్లుగా ఫోజు పెట్టింది.






