పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ.. ఎమోషనల్ పోస్ట్‌తో ఎవరు పుట్టారో కన్ఫార్మ్ చేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-16 07:34:07  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ.. ఎమోషనల్ పోస్ట్‌తో ఎవరు పుట్టారో కన్ఫార్మ్ చేసిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కొద్ది కాలం ప్రేమలో ఎంజాయ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి 2023 ఫిబ్రవరి రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయినప్పటికీ కియారా వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న కియారా అద్వానీ, సిద్ధార్థ్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ అమ్మడు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ తన కొత్త సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసింది. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కియారా రెస్ట్ తీసుకుంటుంది.

ఈక్రమంలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ కియారా, సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి తాము తల్లిదండ్రులు అయినట్లు వెల్లడించారు. ‘‘మా హృదయాలు నిండిపోయాయి. మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. మాకు ఆడపిల్ల పుట్టింది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ భారీ ప్రాజెక్ట్స్ చేసింది. త్వరలో ‘వార్-2’ (war-2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో పాటు ఈ అమ్మడు కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) చిత్రంలోనూ నటిస్తోంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల కియారా కోసం చిత్ర బృందాన్ని యశ్ ముంబైకి తీసుకెళ్లి అక్కడే ఆమెకు సంబంధించిన సీన్స్‌ను కంప్లీట్ చేయించిన విషయం తెలిసిందే.

Next Story