- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
మరో బయోపిక్‌లో నటించనున్న కీర్తి సురేష్..ఆ బయోపిక్ ఎవరిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
![మరో బయోపిక్‌లో నటించనున్న కీర్తి సురేష్..ఆ బయోపిక్ ఎవరిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? మరో బయోపిక్‌లో నటించనున్న కీర్తి సురేష్..ఆ బయోపిక్ ఎవరిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?](https://www.dishadaily.com/h-upload/2023/10/12/269893-keerthi-suresh.webp)
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేశ్ గురించి సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడుకు మంచి ఫ్యాన్స్ ఫాలొయింగ్ ఉంది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఆమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత మలయాళ మూవీ ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో హీరో రామ్‌తో తొలిసారిగా జతకట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘నేను శైలజ’ మూవీతో పరిచయం అయింది. ఆ తర్వాత అమ్మడుకు భారీ ఆఫర్స్‌తో దూసుకెళ్లింది. ఈ ముద్దుగుమ్మ సినీ కేరిర్‌లో గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు ఐతే మహానటి మూవీ మరో ఎత్తు అని చెప్పవచ్చు.
ఆ మూవీలో సావిత్రి గారి లాగే అద్భుతంగా నటించింది మరోసారి తెరపై సావిత్రిని చూపించిందనే చెప్పవచ్చు. ఆమె కెరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. సావిత్రి గారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే మరో పాత్ర చేయలేదంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకు పోయిందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందని ఓ వార్త కొలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మెప్పించిన కీర్తి సురేశ్..ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత ‘MS సుబ్బలక్ష్మి’ జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. తమిళనాడులో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? జీవితంలో ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తారని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని సమాచారం.