'భోళా శంకర్' కు కీర్తి సురేష్ డబ్బింగ్ షురూ..

by Disha Web Desk 1 |
భోళా శంకర్ కు కీర్తి సురేష్ డబ్బింగ్ షురూ..
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'భోళా శంకర్'. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటయా నటిస్తోంది. ఆగస్టు 11న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా దర్శకుడు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సినిమాకు సంబంధించిన అద్భుతమైన అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ తన డబ్బింగ్ పనులను ప్రారంభించిందని వెల్లడించారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్, రఘుబాబు, రవిశంకర్, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఏ.కే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ బాణీలు అందిస్తున్నారు.



Next Story

Most Viewed