ఆ ఒక్క సీన్ చూసి దేనికి పనికిరానన్నారు.. కన్నీరు పెట్టుకున్న Katrina Kaif

by Disha Web Desk 7 |
ఆ ఒక్క సీన్ చూసి దేనికి పనికిరానన్నారు.. కన్నీరు పెట్టుకున్న Katrina Kaif
X

దిశ, సినిమా: స్టార్ నటి కత్రినా కైఫ్ 'సాయా' చిత్రం నుంచి తనను తొలగించిన తర్వాత జీవితంతో పాటు కెరీర్ కూడా ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడించింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 2003లో వచ్చిన 'సాయా'లో కేవలం తనపై ఒక షాట్ చిత్రీకరించి అంతగా ప్రభావం చూపట్లేదనే కారణంగా సినిమానుంచి తనను తొలగించారని, దీంతో ఎప్పటికీ నటిని కాలేనని సెట్‌లోనే ఏడ్చినట్లు తెలిపింది.

అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లంతా ఎక్కడో ఒకచోట తిరస్కరణను ఎదుర్కొంటారన్న ఆమె.. తనను కూడా చాలామంది 'నువ్వు నటివి కాలేవు. నీలో చెప్పుకునేంత టాలెంట్ ఏమీ లేదు' అని తన ముఖం మీదే సూటిగా చెప్పినట్లు గుర్తు చేసుకుంది. అలాగే నటులుగా గొప్ప ప్రతిభను కలిగివుండాలంటే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఎల్లప్పుడూ కష్టపడి పని చేయడంతోపాటు ఒడిదొడుకులను తట్టుకుని దృఢంగా నిలబడాలని సూచించింది. ఇక అదే ఏడాది 2003లోనే వచ్చిన 'బూమ్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కత్రిన.. రీసెంట్‌గా నటించిన హార్రర్ కామెడీ 'ఫోన్ భూత్‌'తో నవంబర్ 4న ప్రేక్షకులముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి :

ఇప్పటి వరకు జిమ్ ముఖం కూడా చూడలేదు: Sai Pallavi


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed