సింగర్ చిన్మయి క్యారెక్టర్ అలాంటిది.. వైరముత్తు పర్‌ఫెక్ట్ వ్యక్తి మంచోడు.. కస్తూరి శంకర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
సింగర్ చిన్మయి క్యారెక్టర్ అలాంటిది.. వైరముత్తు పర్‌ఫెక్ట్ వ్యక్తి మంచోడు.. కస్తూరి శంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో చాలామంది కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మీటూ ఉద్యమంలో భాగంగా.. టాలీవుడ్ సింగర్ చిన్మయి, తమిళ దిగ్గజ రైటర్‌ వైరముత్తు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పలు ఆరోపణలు చేసింది. వీరి వివాదం గత కొద్ది కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సమయంలో ఉన్నప్పుడల్లా చిన్మయి సోషల్ మీడియా వేదికగా వైరముత్తుపై పలు పోస్టులు షేర్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, చిన్మయి, వైరముత్తు వివాదంపై గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ‘‘నాకూడా మీటూ అనుభవం ఉంది. కానీ నిరూపించాలంటే ఆధారాలు లేవు. వాటికోసం నేను ఎక్కడికి పోవాలి. చిన్మయి ఆ రిస్క్ తీసుకుని వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసింది. అయితే నాకు ఇద్దరు చాలా కాలంగా తెలుసు. వైరముత్తును అయితే ఏకంగా 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నోసార్లు ఆయనను కలిశాను.

చాలా పర్‌ఫెక్ట్ నన్ను మెచ్చుకోవడంతో పాటుగా పని పరంగా చాలా ఎంకరేజ్ చేసేవారు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇక చిన్మయి విషయానికి వస్తే ఆమె 20 ఏళ్ల నుంచి తెలుసు. తన క్యారెక్టర్ పరంగా బంగారు తల్లి అని చెప్పవచ్చు. చాలా మంచిది ధైర్యవంతురాలు. అన్యాయాన్ని ఎదిరించి నిలబడుతుంది. అయితే చిన్మయి, వైరముత్తు మధ్య ఏం జరిగింది అనేది తెలుసు. కానీ చర్చించాలంటే ఆధారాలు కచ్చితంగా కావాలి. అయితే చాలా మంది ఏదైనా పోరాటం కలిసి చేస్తారు కానీ చిన్మయి ఒంటరిగా చేస్తుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. దాని గురించి నేను కూడా ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed