జాతీయ అవార్డు కావాలని నేను ఎవరినీ అడగలేదు: కశ్మీర్ ఫైల్స్ నిర్మాత

by Disha Web Desk 2 |
జాతీయ అవార్డు కావాలని నేను ఎవరినీ అడగలేదు: కశ్మీర్ ఫైల్స్ నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్ ఫైల్స్ సినిమాను జనం మెచ్చారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. జాతీయ అవార్డు రావాలని తానేమి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు కాబట్టే జాతీయ అవార్డు వరించిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. నిజాలు చూపించే సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కాగా, అంతకుముందు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడాన్ని విమర్శిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు. వివాదాస్పద సినిమా అయిన కశ్మీర్ ఫైల్స్‌కు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జాతీయ అవార్డులు రాజకీయాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చిత్రాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని సీరియస్ అయ్యారు. ఎన్నికల వేళ కావాలనే సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. తమిళ ఎంసీ స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు.

Read More: Anupama Parameswaran : రెడ్ డ్రెస్‌లో అనుపమ క్యూట్ స్టిల్స్..

Next Story

Most Viewed