Kantara: Chapter 1: విడుదలకు ముందే ‘కాంతార: చాప్టర్1’ క్రేజీ రికార్డు.. ఏకంగా ‘ఓజీ’ని చిత్తుచేసిందిగా!

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భారీ చిత్రాలతో రాబోతున్న విషయం తెలిసిందే.

Kantara: Chapter 1: విడుదలకు ముందే ‘కాంతార: చాప్టర్1’ క్రేజీ రికార్డు.. ఏకంగా ‘ఓజీ’ని చిత్తుచేసిందిగా!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భారీ చిత్రాలతో రాబోతున్న విషయం తెలిసిందే. వారం గ్యాప్‌లోనే ఓజీ, ‘కాంతార: చాప్టర్1’ విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాల అప్డేట్స్ విడుదలై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఇటీవల ట్రైలర్ విడుదలవగా.. యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా మాత్రం కాంతార జోరు కనిపిస్తెంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్‌నే రిషబ్ శెట్టి డామినేట్ చేయడం గమనార్హం. ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించగా... ‘కాంతార: చాప్టర్1’ తెలుగు వెర్షన్ 15 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ ఫ్యాన్స్‌ను కలిగి ఉన్న పవన్ ‘ఓజీ’ ట్రైలర్ తక్కువ వ్యూస్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక కాంతార: చాప్టర్1(Kantara: Chapter 1) ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 110 మిలియన్లు వ్యూస్‌ను దాటేసి అందరినీ మెప్పిస్తోంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అత్యధిక వ్యూస్, లైక్స్‌ను రాబట్టుకుంది. కాగా..ఈ మూవీలో రిషబ్ హీరోగానే నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రిషబ్ సరసన క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విజయదశమి నాడు అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story