‘కాంచన-4’ షూటింగ్ స్టార్ట్.. సంచలన నిర్ణయంతో బిగ్ షాకిచ్చిన రాఘవ.. వైరల్‌గా మారిన ట్వీట్

by Mallepaka Hamsa |

రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

‘కాంచన-4’ షూటింగ్ స్టార్ట్.. సంచలన నిర్ణయంతో బిగ్ షాకిచ్చిన రాఘవ.. వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అంతేకాకుండా ఓ ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే సోషల్ మీడియాలోనూ సాయం కోరిన వారికి తనవంతుగా ఏదో ఒక సాయం చేస్తుంటారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘కాంచన-4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంచన-3’ సీక్వెల్‌గా రానుంది. ఇందులో పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్. తాజాగా, రాఘవ ‘కాంచన-4’(Kanchana-4) షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మీ అందరితో కొన్ని ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

నా సినిమా కాంచన 4 అధికారికంగా ప్రారంభం అయింది. అది చాలా బాగా వస్తోంది. మీలో చాలా మందికి తెలిసినట్లుగా, నా సినిమాలకు అడ్వాన్స్ అందుకున్న ప్రతిసారీ, నేను నా హృదయానికి దగ్గరగా ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఈసారి, నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నానని ప్రకటించడానికి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది, నేను డ్యాన్స్ మాస్టర్‌గా చేసినప్పుడు పొదుపు చేసిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది.

తర్వాత నేను దానిని అనాథాశ్రమ పిల్లల గృహంగా మార్చాను. నా కుటుంబం, నేను అద్దెకు తీసుకున్న స్థలంలోకి మారాము. ఈ రోజు, నా పిల్లలు పెద్దవారై పని చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను నియమించబోయే మొదటి ఉపాధ్యాయుడు నా ఇంట్లో పెరిగి ఇప్పుడు ఎదిగి, చదువుకుని, తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పిల్లలలో ఒకరు కావడం నాకు మరింత సంతోషంగా.. గర్వంగా ఉంది. ఈ కొత్త ప్రారంభానికి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

link

Next Story