- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్స్ వర్కర్ పాత్రలో గొప్ప అనుభూతి పొందాను.. నాకు అలాంటి కథలే కావాలి
‘నీర్జా ఏక్ నయీ పెహచాన్’ సిరీస్‌లో సెక్స్ వర్కర్‌గా నటించడంలో ఎదురైన సవాళ్లపై ఓపెన్ అయింది

దిశ, సినిమా: ‘నీర్జా ఏక్ నయీ పెహచాన్’ సిరీస్‌లో సెక్స్ వర్కర్‌గా నటించడంలో ఎదురైన సవాళ్లపై ఓపెన్ అయింది కామ్య పంజాబీ. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె.. రెడ్-లైట్ ప్రాంతాల నివాసితులు ఎదుర్కొనే సమస్యలు, వివక్షను ఈ ప్రపంచానికి చూపించడమే ఈ షో లక్ష్యమని చెప్పింది. అలాగే నిజానికి అందరూ అనుకున్నట్లు వేశ్యల జీవితాలు అద్భుతంగా ఏమీ ఉండవని, కేవలం సెక్స్ చుట్టు మాత్రమే కాకుండా సమాజం నుంచి అనేక సమస్యలు వాళ్లను చుట్టుముడతాయని, వాటన్నింటిని ఎదుర్కొంటూ బతకడం నిరంతరం ఒక నరకంగానే ఉంటుందని తెలిపింది.
‘మేము కేవలం ఆ పాత్రల్లో నటించేందుకే చాలా స్ట్రగుల్ పడ్డాం. నిజంగా వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. అయితే ఈ షో కారణంగా ఎన్నో అవమానాలు ఎదురవుతాయని భయపడ్డాం. కానీ సమాజాన్ని ఆలోచింపజేసే సాంఘిక నాటకంలో భాగమైనందుకు మాపై ప్రశంసల వర్షం కురిసింది. మేము ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినందుకు చాలా సంతోషించాం. ఇకపై ఇలాంటి పాత్రలు చేయడానికి నేను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాను’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Read More: ఎవ్వరికి చూపించని ప్లేస్‌లో టాటూ.. ఛీ నువ్వు కూడానా జాను అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు






