- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఇండస్ట్రీలో అడుగుపెట్టి 64 ఏళ్లు పూర్తి చేసుకున్న కమల్ హాసన్.. శృతి హాసన్ కామెంట్స్ వైరల్
ఇండస్ట్రీలో అడుగుపెట్టి 64 ఏళ్లు పూర్తి చేసుకున్న కమల్ హాసన్.. శృతి హాసన్ కామెంట్స్ వైరల్
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కమల్ హాసన్

X
దిశ, సినిమా: ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కమల్ హాసన్ .. సినీరంగ ప్రవేశం చేసి నేటికి 64 ఏళ్లు పూర్తయింది. భాషతో సంబంధం లేకుండా అనేక క్యారెక్టర్లతో అలరించిన ఆయన.. ఇప్పటి వరకు 230కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగా కూతురు శ్రుతి హాసన్ తన తండ్రి సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేసింది. ‘నాన్న తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆరు దశాబ్దాలుగా సినీరంగానికి ఆయన సేవలను అందిస్తున్నారు’ అంటూ తెలిపింది. అలాగే తన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ఫొటోను కూడా షేర్ చేసిన కూతురు.. గర్వంగా ఉందని కొనియాడింది.
Next Story






