కమల్ హాసన్, అక్కినేని అమల బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్..! హీరో ఎవరంటే..?

by Disha Web Desk 7 |
కమల్ హాసన్, అక్కినేని అమల బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్..! హీరో ఎవరంటే..?
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీమేక్స్ మూవీ చాలానే వస్తున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇప్పుడు కుర్ర హీరోలు రీమేక్ చేస్తున్నారు. అలా వచ్చిన కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకుంటున్న.. మరికొన్ని మాత్రం బాక్సాపీస్ హిట్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే1988 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాను రీమేక్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడంటా ఓ యంగ్ హీరో.

1988లో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా, అక్కినేని అమల హీరోయిన్‌గా వచ్చిన సినిమా ‘సత్య’. సురేష్ క‌ష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీనీ.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ నిర్మించారు. ఇక అప్పట్లో ఈ మూవీ మంచి విజయాన్ని సాధించి రికార్డులు సృష్టించింది. అయితే.. ఈ మూవీని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట అశోక్ సెల్వన్.

వైవిధ్య భరిత పాత్రలు ఎంచుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు అశోక్ సెల్వన్. ఈయన కమల్ హాసన్ ‘సత్య’ మూవీని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాకుండా.. ఈ చిత్రం కోసం అశోక్ ప్రత్యేకంగా ఫొటో షూట్‌ను కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘సత్య’ మూవీ రీమేక్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కమల్ ఫ్యాన్స్.


Next Story

Most Viewed