భర్త కాదు అతడే kajol బిగ్ క్రష్.. పబ్లిక్‌గా చెప్పేసిన karan johar

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-18 07:51:58  IST  )

సీనియర్ నటి కాజోల్ తన ఫస్ట్ క్రష్‌ గురించి ఓపెన్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన 'సలామ్ వెంకీ' డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా డ్యాన్స్.. Latest Telugu News

భర్త కాదు అతడే kajol బిగ్ క్రష్.. పబ్లిక్‌గా చెప్పేసిన karan johar
X

దిశ, సినిమా: సీనియర్ నటి కాజోల్ తన ఫస్ట్ క్రష్‌ గురించి ఓపెన్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన 'సలామ్ వెంకీ' డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లా జా 10'కి హాజరైంది. ఈ క్రమంలో షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మనీష్ పాల్.. ఆమె భర్త అజయ్ దేవగన్‌ను పక్కన పెట్టి బాలీవుడ్‌లో తన ఫస్ట్ క్రష్‌ను వెల్లడించాలని కోరారు. దీంతో ఈ షోలో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పేశాడు. 'కాజోల్‌కు అక్షయ్ కుమార్‌పై క్రష్ ఉంది. 1994లో వచ్చిన 'యే దిల్లగి'లో కలిసి నటించినపుడు ఈ విషయం బయటపడింది' అని చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసిన కాజోల్ నిజమే అన్నట్లుగా హర్ట్‌ఫుల్ స్మైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక రేవతి దర్శకత్వం వహించిన 'సలామ్ వెంకీ' నుంచి రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి: టీజర్‌తో సినిమాను అంచనా వేయొద్దు : 'ఆదిపురుష్' గురించి kriti sanon

Next Story