నీల్ కిచ్లు బర్త్‌డే.. వైరల్ అవుతున్న కాజల్ స్పెషల్ వీడియో

by Disha Web Desk 7 |
నీల్ కిచ్లు బర్త్‌డే.. వైరల్ అవుతున్న కాజల్ స్పెషల్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట గత ఏడాది ఏప్రిల్-19న కుమారుడు (నీల్ కిచ్లు) కు జన్మనిచ్చారు. ఈ క్రమంలో నీల్ కిచ్లు మొదటి పుట్టిన రోజు వస్తున్న సందర్భంగా.. కాజల్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. అయితే కాజల్ పోస్ట్ చేసిన వీడియోలో కొడుకు ఫేస్ మాత్రం చూపించలేదు.

ఈ పోస్ట్ చూసిన చందమామ అభిమానులు, నెటిజన్లు మాత్రం నీల్ కిచ్లుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొడుకుకి జన్మనిచ్చిన అనంతరం కాజల్ కమల్ హాసన్ ‘ఇండియన్-2’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ 1996లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భారతీయుడుకి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి కాజల్ మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది.





Next Story

Most Viewed