స్కిట్ కోసం నాలుకను తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

by Disha Web Desk 6 |
స్కిట్ కోసం నాలుకను తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?
X

దిశ, సినిమా: బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారమవుతున్నప్పటికీ జబర్దస్త్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ఈ షో చూస్తే ఎంతోమంది తమ బాధను కూడా మర్చిపోతారనడంలో అతిశయోక్తి లేదు. ఇందులోని కమెడియన్స్ అద్భుతమైన కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇందులోని కమెడియన్స్‌కు ఎంతలా పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు పలు చిత్రాల్లోనూ నటించి జనాలను నవ్వించారు. అయితే ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో ఈ షో ప్రసారం అవుతుంది. తాజాగా, విడుదలైన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ షోలో స్కిట్ కోసం ఓ కమెడియన్ నాలుకను కోసేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిజజీవితంలో కాదులెండి.. స్కిట్ కోసం తన మాటలను త్యాగం చేశాడు.

అసలు విషయంలోకి వెళితే.. కమెడియన్ సన్నీ, దొరబాబులతో, ఆటో రాంప్రసాద్ ఓ స్కిట్ చేశారు. ఈ క్రమంలో మాది మంచి పురం అండి. మా ఊరోళ్లంతా మంచోళ్ళు అని రామ్ ప్రసాద్ అంటాడు. అంతేకాకుండా అతను నా తమ్ముడు అని సన్నీని చూపిస్తాడు. ఆ తర్వాత వాడు చాలా మంచివాడు అనగా.. దీంతో అక్కడే ఉన్న బాబు ఎందుకు అంత మంచి వాడు అయ్యాడు అని అడగుతాడు.. ఇక రాంప్రసాద్.. ఈ స్కిట్ కోసం చాలా పెద్ద త్యాగం చేశాడని చెప్తాడు. దానికి బాబు ఆ త్యాగం ఏంటో మాక్కూడా చెప్పవా అని అనడంతో.. సన్నీ స్కిట్ కోసం తన నాలుక తీసేసుకున్నాడు డైలాగ్స్ లేకుండా అని అంటాడు. దీంతో అంతా షాక్ అయి చూస్తారు.. అంతలోనే రామ్ ప్రసాద్ ఈ స్కిట్‌లో వీడికి మాటలు లేవు అని చెప్తాడు. ఆ తర్వాత బాబు హీరోలా ఉన్నాడని మీసాలు మెలేసి చెప్తాడు. అయితే కేవలం అదంతా స్కిట్‌లో భాగంగా మూగవాడిగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ ప్రోమో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. దీని పూర్తి ఎపిసోడ్ మార్చి 29న ప్రసారం కానుంది.


Next Story

Most Viewed