ఇది చాలా ఉత్తేజకరంగా ఉండబోతుంది.. మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దేని గురించంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) నటిస్తున్న చిత్రాల్లో ‘హృదయ పూర్వం’(hrudaya purvam) ఒకటి.

ఇది చాలా ఉత్తేజకరంగా ఉండబోతుంది.. మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దేని గురించంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) నటిస్తున్న చిత్రాల్లో ‘హృదయ పూర్వం’(hrudaya purvam) ఒకటి. ఈ సినిమాలో మోహన్‌లాల్(Mohanlal) హీరోగా నటిస్తుండగా.. బసితా జోసెఫ్, సంగీత్, సంగీత(sangeetha), లాలూ అలెక్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మోహన్ లాల్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా? స్క్రీన్‌పై మాళవిక, మోహన్ లాల్‌ను చూద్దామా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘హృదయపూర్వం’ మూవీ మేకర్స్ రిలీజ్ తేదీ ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 28న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మాళవిక ‘‘ఆగస్టు 28న థియేటర్స్‌లో కలుద్దాం. ఇది చాలా అందంగా, ఉత్తేజకరంగా ఉండబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది.

Next Story