నా తండ్రి అలా చేయడం వల్లే మగవాళ్లంటే అసహ్యం పెరిగింది.. నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఒకవేళ ఎవరితోనైనా రిలేషన్ వర్కవుట్ కాకపోతే, వారు నన్ను వదిలేసి వెళ్తారనే నిజాన్ని నేను త్వరగా జీర్ణించుకోలేను. బ్రేకప్ నుంచి బయటపడటం నాకు చాలా కష్టం.

నా తండ్రి అలా చేయడం వల్లే మగవాళ్లంటే అసహ్యం పెరిగింది.. నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. తెరపై గ్లామరస్‌గా కనిపించే ఆమె జీవితం వెనుక ఎంతో మానసిక వేదన ఉందని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి వదిలేసి వెళ్లడం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆమె ఎమోషనల్‌గా వివరించారు. చిన్నప్పుడు తాను షకీరా, జెన్నిఫర్ లోపెజ్ వంటి సెలబ్రిటీలను చూసి స్ఫూర్తి పొందేదాన్నని, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన తల్లి అంతకంటే గొప్ప స్ఫూర్తి అని నోరా అన్నారు. "మా అమ్మ ఒక సింగిల్ మదర్. తమ్ముడిని, నన్ను పెంచడానికి ఆమె పడరాని పాట్లు పడింది. మమ్మల్ని ఉత్తమంగా పెంచడం కోసం ఆమె ఎన్నో ఉద్యోగాలు చేస్తూ కష్టపడింది. నిజమైన స్ఫూర్తి మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచే వస్తుందని నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చారు. సింగిల్ మదర్ పెంచడం వల్ల పురుషులతో తన సంబంధాలు ఎలా ఉన్నాయని యాంకర్ అడిగిన ప్రశ్నకు నోరా స్పందిస్తూ.. "నాకు నా తండ్రితో సమస్యలు ఉన్నాయి" అని నిజాయితీగా ఒప్పుకున్నారు.

తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత, తండ్రి చాలా కాలం పాటు కనిపించకుండా పోవడంతో పురుషుల పట్ల అసహ్యం పెంచుకున్నట్లు తెలిపారు. ఆడపిల్లలు అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు, పురుషులు మహిళలను చూసే విధానంపై వ్యతిరేకత ఏర్పడుతుందని ఆమె అన్నారు. తండ్రి తనను వదిలేసి వెళ్లడం వల్ల తనలో భయం పెరిగిపోయిందని నోరా వెల్లడించారు. "ఒకవేళ ఎవరితోనైనా రిలేషన్ వర్కవుట్ కాకపోతే, వారు నన్ను వదిలేసి వెళ్తారనే నిజాన్ని నేను త్వరగా జీర్ణించుకోలేను. బ్రేకప్ నుంచి బయటపడటం నాకు చాలా కష్టం. గతంలో నాకు సరిపడని వ్యక్తులతో ప్రేమలో ఉన్నప్పటికీ, వారు నన్ను వదిలేస్తారనే భయం వల్ల నేను రిలేషన్ నుంచి త్వరగా బయటకు రాలేకపోయాను. ఇదంతా నా తండ్రి వల్ల నాలో కలిగిన మానసిక వేదన. అది నా తప్పు కాదు, కానీ నాపై ప్రభావం పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఆ మానసిక సమస్యల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లు నోరా స్పష్టం చేశారు.

Next Story