జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించారు అనడం కరెక్ట్ : అమలా పాల్

by Disha Web Desk 9 |
జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించారు అనడం కరెక్ట్ : అమలా పాల్
X

దిశ, సినిమా: హీరోయిన్ అమలా పాల్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా విజయ్, ధనుష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో ప్రేమ, పెళ్లి అంటూ సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె వివాహం చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. దీంతో వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణంపై ఎక్కువగా ప్రభావం చూపించింది. అయినా వెనుకడుగు వేయకుండా విడాకుల అనంతరం కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

‘మైనా సినిమా చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. మానసిక ఒత్తిడికి గురయ్యాను. అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. అదే సమయంలో నేను నటించిన కొన్ని సినిమాలు హిట్ ఇవ్వకపోవడంతో నాపై మరింత ఒత్తిడి పెరిగింది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించారని చెప్పడం కరెక్ట్. నేను 13 ఏళ్ల వయసు నుంచి కష్టపడుతున్నాను. కానీ ఏ రోజు కూడా సంతోషంగా లేను. ఏదో వెతుక్కుంటూ తిరుగుతున్నాను. విజయం కోరి వెళుతున్నా. కానీ నాతో ఎవరు లేరు. నన్ను నేను కోల్పోయాను. నాకు కూడా మంచి సలహా ఇచ్చి ముందుకు నడిపేవారు ఉండి ఉంటే అందరిలాగే నేను కూడా చాలా సంతోషంగా ఉండేదాన్నేమో’ అంటూ చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed