Samantha: అది నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది.. నాగచైతన్య జ్ఞాపకాలను మర్చిపోలేదంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సమంత

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-18 08:30:55  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) కాంబోలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ రీరిలీజ్ కాబోతుంది.

Samantha: అది నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది.. నాగచైతన్య జ్ఞాపకాలను మర్చిపోలేదంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సమంత
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) కాంబోలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ రీరిలీజ్ కాబోతుంది. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై మనసుల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు ఘన విజయం సాధించిన ఈ మూవీ మళ్లీ జూలై 18న థియేటర్స్‌లోకి రానుంది. ఈనేపథ్యంలో.. సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి మళ్లీ కలిసిపోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.వీరిద్దరు కలిసి ప్రమోషన్స్ చేయనున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘చిత్రబృందంతో కలిసి నేను ‘ఏ మాయ చేసావే’(Ye Maaya Chesave) ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు. అలాంటి ప్లాన్ కూడా లేదు. ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. అభిమానులు, నటీనటులు కలిసి సినిమా ప్రమోట్ చేస్తారని ఊహించుకుని ఉండవచ్చు.

ఒకరి జీవితం ప్రేక్షకుల ఊహల మీద ఆధారపడి ఉండదు. ప్రతి షాట్ నాకు నిజంగా గుర్తుంది. ఆ సినిమా కోసం నేను చేసిన మొదటి షాట్ గేట్ వద్ద ఉంది. నా పాత్ర జెస్సీ కార్తీక్ (నాగ చైతన్య)ని మొదటిసారి కలిసినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం నాకు గుర్తున్నాయి. గౌతమ్ మీనన్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతనికి ఏమి కావాలో, ఆ పాత్ర ఎలా రావాలో ఖచ్చితంగా తెలుసు. ఆయనతో పనిచేయడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. నిజం చెప్పాలంటే నా మొదటి షాట్ మాస్కోవా-కావేరి అనే చిత్రానికి చేశాం. అందులో రాహుల్ రవీంద్రన్ హీరోగా చేశారు. కానీ ఈ మూవీ జ్ఞపకాలు అంతగా గుర్తు లేవు. కానీ ‘ఏమాయ చేసావే’కి సంబంధించిన ప్రతి విషయం గుర్తుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story