కెరీర్ నాశనం అయినా పర్లేదు.. మాకు పవన్ కళ్యాణ్ సినిమానే ముఖ్యం!

by Disha Web Desk 9 |
కెరీర్ నాశనం అయినా పర్లేదు.. మాకు పవన్ కళ్యాణ్ సినిమానే ముఖ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో Ustaad Bhagat Singh (ఉస్తాద్ భగత్ సింగ్) ఒకటి. దీనిని సంచలన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇదిలా ఉండగా.. ట్విట్టర్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఓ అభిమాని ఆసక్తికర ట్వీట్ పెట్టాడు. ఇప్పటికే 50% షూటింగ్ అయిపొయిందట కదా అన్న.. క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి అని చెప్పాడు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఆ విషయం మాకు వదిలేయ్ తమ్ముడు.. నువ్వు ముందు కెరియర్ మీద దృష్టి పెట్టు అని సూచించాడు. దీనికి మరో అభిమాని స్పందిస్తూ కెరియర్ పోతే పోనీ అన్న.. మాకు పవన్ కళ్యాణ్ సినిమా ముఖ్యం అని రీప్లే ఇచ్చారు. మళ్ళీ దీనికి డైరెక్టర్ స్పందిస్తూ ''ఐ విల్ ట్రై మై బెస్ట్'' అని చెప్పాడు. దీనికి అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed