‘వారణాసి’ బడ్జెట్ రూ. 1300 కోట్లా..? హాట్ టాపిక్‌గా ప్రియాంక చోప్రా కామెంట్ ! (వీడియో)

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’(Varanasi).

‘వారణాసి’ బడ్జెట్ రూ. 1300 కోట్లా..? హాట్ టాపిక్‌గా ప్రియాంక చోప్రా కామెంట్ ! (వీడియో)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’(Varanasi). ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. లాంగ్ గ్యాప్ తర్వాత.. టాలీవుడ్‌కు పరిచయం కాబోతుండటం విశేషం. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత కీలకమైన సినిమా కానుందని టాక్. ప్రపంచ స్థాయి థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ కోసం అత్యాధునిక టెక్నికల్ టీమ్‌ను సమకూర్చారని సమాచారం. చిత్రీకరణ కోసం ఇండియా, ఆఫ్రికా, యూరప్‍ల్లోని పలుచోట్ల భారీ సెట్‌లు వేశారని తెలుస్తోంది.

మహేష్ లుక్ కూడా గత చిత్రాలన్నింటికంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతుందట. అంతేకాకుండా ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ స్టంట్లను డిజైన్ చేయడానికి ఇంటర్నేషనల్ యాక్షన్ టీమ్ పని చేస్తోంది. మహేష్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రపంచ స్థాయి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నాయట. రాజమౌళి మార్క్‌లో కథ, స్క్రీన్ ప్లే, స్పెషల్ ఎఫెక్ట్స్ కలిసి అభిమానులకు మరచిపోలేని అనుభూతిని ఇవ్వనున్నాయని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా అడవుల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. ప్రజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతన్నట్లు సమాచారం. హై-అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా విడుదలయ్యే చాన్స్ ఉన్నట్లు టాక్.

అయితే గత కొద్ది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈక్రమంలో.. ‘వారణాసి’ బడ్జెట్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా, కపిల్ శర్మ షోలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఈ విషయంపై నోరు విప్పింది. కపిల్ శర్మకు కౌంటర్ ఇచ్చింది. ‘వారణాసి’ చిత్రానికి రూ. 1300 కోట్ల బడ్జెట్ అని విన్నాను నిజమేనా? అని అడగ్గా.. అందుకు ప్రియాంక స్పందిస్తూ.. ‘‘నిజంగానే రూ. 1300 కోట్లా? ఒకవేళ అదే నిజమైతే అందులో సగం డబ్బు నా అకౌంట్‌లోకి వచ్చిందా? అని నా మేనేజర్‌ని అడగాలి. ఈ ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు’’ అని చెప్పింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

link

Next Story