ఆ హీరోయిన్ మృతికి భర్తే కారణమా? బయటపడ్డ సంచలన విషయాలు

by Kodari Anjali |   (  Updated:2023-09-06 07:05:15  IST  )

మలయాళ స్టార్ నటి ‘అపర్ణ నాయక్’ అనుమానస్పద స్థితిలో ఆగస్టు 31న కేరళలోని తిరువనంతపురం కరమనలోని ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.

ఆ హీరోయిన్ మృతికి భర్తే కారణమా? బయటపడ్డ సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ నటి ‘అపర్ణ నాయక్’ అనుమానస్పద స్థితిలో ఆగస్టు 31న కేరళలోని తిరువనంతపురం కరమనలోని ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈమె మరణానికి ముఖ్య కారణం తన భర్త సంజిత్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘మద్యానికి బానిపైన మా బావ.. అపర్ణ అక్కతో తరచూ గొడవ పెట్టుకునేవాడు. ప్రతిరోజూ ఆమెను తాగొచ్చి టార్చర్ చేసేవాడు, ఆ బాధను తట్టుకోలేకనే మా అక్క చనిపోయింది. అక్క చనిపోయే ముందు మా అమ్మకు కాల్ చేసి.. ఈ గొడవలతో విసిగిపోయానని, బతకాలని లేదు. చనిపోవాలనిపిస్తుంది అని చెప్పింది.’’ అంటూ అపర్ణ సోదరి ఐశ్వర్య పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి: Kareena Kapoor కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సైఫ్.. అటిట్యూడ్ మార్చుకోవాలంటూ

Next Story