- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ ‘RT-76’ సినిమాకు ఆసక్తికర టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిందంటున్న నెటిజన్లు
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కాబోతుంది. దీంతో పాటు రవితేజ నేను శైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల (Kishore Tirumala)దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో 76 ప్రాజెక్ట్‌గా రాబోతుంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ RT-76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ నెలాఖరులోపు షూట్ పూర్తి కాబోతున్నట్లు సమాచారం.
అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ మూవీకి ఓ టైటిల్ ఫిక్స్ చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కిషోర్ తిరుమల రైటింగ్‌లో సాఫ్ట్ టచ్, రవితేజ మాస్ క్యాచ్ టచ్ ఉండేలా.. ‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు టాక్. ఆల్మోస్ట్ ఇదే పేరును ఫైనల్ చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు టైటిల్ అదిరిపోయిందని అంటున్నారు.






