ఆస్కార్‌ మూవీ 'చెల్లో షో' బాల నటుడు మృతి

by Dishanational4 |
ఆస్కార్‌ మూవీ చెల్లో షో బాల నటుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: 'చెల్లో షో' సినిమా వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు ఎంట్రీ ఇవ్వబోతుండగా ఈలోపు ఓ వార్త బృందంలో విషాదాన్ని నింపింది. చెల్లో షో సినిమాలో కీలక పాత్ర పోషించిన బాల నటుడు రాహుల్ కోలీ కన్నుమూసినట్లు సమాచారం. 15 ఏళ్ల రాహుల్ కోలీ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు తెలుస్తోంది. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న రాహుల్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిలో చేరారు.

పరిస్థితి మరింత విషమించడంతో ఇటీవల తుదిశ్వాస విడిచారు. జామ్‌నగర్‌ సమీపంలోని హాపా గ్రామంలోని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. చెలో షో సినిమా అక్టోబ‌ర్ 14న విడుద‌ల కానుంది. అతని తండ్రి రాము కోలి మాట్లాడుతూ.. 'అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాడు. అక్టోబర్ 14 తర్వాత మా జీవితం పూర్తిగా మారిపోతుందని కూడా చెప్పాడు. సినిమా విడుదల కాకముందే మనల్ని విడిచి పెట్టాడు.' అని అతని తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఎంట్రీ ఇవ్వనుండగా.. రాహుల్ మృతి చెందడం విషాదంగా మారింది.

ఇవి కూడా చదవండి : ఒకేసారి రెండు ఓటీటీల్లో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం

Next Story

Most Viewed