‘చంద్రముఖి 2’కి లారెన్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

by Disha Web Desk 7 |
‘చంద్రముఖి 2’కి లారెన్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
X

దిశ, సినిమా: పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ మూవీకి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ తాజాగా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అయినా వచ్చాయా అంటే అదీ లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కోటి 65 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి అదనంగా మరో రూ. 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రూ. 12 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఇకపోతే తాజాగా హీరో లారెన్స్ ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి లారెన్స్ భారీ మొత్తంలో ఏకంగా రూ.30 కోట్లు అందుకున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed