Balakrishnaను చూస్తే అలాగే అనిపిస్తారు.. Sreeleela ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
Balakrishnaను చూస్తే అలాగే అనిపిస్తారు.. Sreeleela ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ ‘ధమాకా’ చిత్రంతో సూపర్ హిట్ అందుకోవడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో శ్రీ లీల చేతిలో పది సినిమాలు స్టార్ హీరోలవే కావడం విశేషం. అయితే శ్రీ లీల బాలయ్యతో ‘భగవంత్ కేసరిలో’ ప్రధాన పాత్రలో నటిస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘బాలకృష్ణ సార్‌ బయట వేరు, కెమెరాముందుకొస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి ఎంటరయ్యారంటే ఇక ఆయన భగవంత్‌ కేసరే.. బాలకృష్ణ కాదు. అంతగా పాత్రలో లీనమవుతారు. ఇందులో మా పాత్రల గురించి రివీల్‌ చేయడం నాకిష్టం లేదు. అయితే.. ఈ సినిమా చేస్తున్నంత సేపు ఆయన నాకు సొంత బాబాయ్‌లాగే అనిపించారు. ఆయనకూడా లొకేషన్‌లో నన్ను అలాగే చూసుకున్నారు. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్య సార్‌తో చేయాలనుంది’’ అని తెలిపింది.

Also Read: ఆ విషయం గురించి Vijayకి చెప్పేస్తానంటూ... Samantha ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed