- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సర్జరీ తర్వాత బతుకుతానో లేదో అనుకున్నాను.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్నారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ త్వరలో ‘45’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అర్జున్ జన్య (Arjun Janya)దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలోఉపేంద్ర, రాజ్ బి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రానుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన శివరాజ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ఆయన పలు విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు రాజకీయాలు తెలియవు. నేను చేయగలిగిన సహాయం ఏదైతే ఉందో, అది నేను ఇప్పటికే చేస్తున్నాను. దాని కోసం నాకు అధికారం అవసరం లేదు.
నేను పక్షపాతం లేకుండా ఎవరికైనా సహాయం చేయగలను. కానీ రాజకీయాల్లో అలా జరగదు. కేవలం కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అది నా సొంత డబ్బు కాబట్టి నేను ఎవరికైనా సహాయం చేయగలను’’ అని అన్నారు. ఆ తర్వాత తనకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ‘‘ఆపరేషన్‌కు వెళ్లే ముందు, నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను తిరిగి వస్తానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఐదు గంటల ఆపరేషన్ తర్వాత, నేను నా భార్య చేతిని పట్టుకుని, 'నిన్ను మళ్ళీ చూస్తానని నేను ఊహించలేదు' అని చెప్పాను.
ఆ తర్వాత నా ప్రపంచం మొత్తం మారిపోయింది. డబ్బు ఈరోజు లేదా రేపు రావచ్చు, కానీ ఆ ప్రేమ అంతా నా జీవితాంతం నాతోనే ఉంటుంది’’ అని పెర్కోన్నారు. అలాగే తాను ‘జైలర్-2’ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ‘‘నేను జైలర్-2 సినిమాలో నటిస్తున్నాను. నా షూటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఇది మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. మొదటి భాగాన్ని అనుసరించి, నా పాత్ర ప్రవేశం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. నేను జనవరి 6, 8, 9, మరియు 10 తేదీల మధ్య నా షూటింగ్‌ను పూర్తి చేస్తాను’’ అన్నారు.






