ఆయనతో నటించడానికి భయంగా ఉంది.. ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రీతి అస్రాని

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆయనతో నటించడానికి భయంగా ఉంది.. ఆ పాత్రకు  నన్ను ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రీతి అస్రాని
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘మళ్లీరావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. త్వరలో ప్రీతి అస్రాని ‘కిస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ‘కిల్లర్’(Killer) ఒకటి. ఇందులో మల్టీ టాలెంటెడ్ నటుడు ఎస్.జె సూర్య(Suryah) హీరోగా నటిస్తుండగా.. ప్రీతి ఆయనతో రొమాన్స్ చేయనుంది. సూర్య హీరోగానే కాకుండా ‘కిల్లర్’ను తెరెకెక్కిస్తుండటంతో పాటు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా సమకూరుస్తుండటం విశేషం.

ఈ సినిమాను గోకులం మూవీస్‌తో కలిసి సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ బ్యానర్స్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి అస్రాని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘Killer లో నేను చాలా భిన్నమైన పాత్రను పోషించాను. అలాంటి పాత్రను ఇప్పటి వరకు చూసిండరు.

నేను ఇన్నాళ్లు చేసిన సినిమాలన్నింటిలో ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈ చిత్రం మీ ఊహలకు మించి ఉంటుంది. నా పాత్ర చాలా బాగుంటుంది. సూర్య సర్ శక్తి & అతని అభిరుచి కొత్త స్థాయికి చేరుకుంది. అతనితో స్క్రీన్ పంచుకోవడానికి కొంచెం భయంగా ఉంది. ‘కిల్లర్’ కోసం మొదట సూర్య సర్ 80 మందిని ఆడిషన్ చేశారు. అందులో నన్ను ఎంపిక చేసుకున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే మా సినిమా మీ ముందుకు రాబోతుంది’’ అని చెప్పుకొచ్చింది.

Next Story