- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. ప్రపంచానికి నేనే ప్రకటిస్తాను.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికిన క్షణమే ఆ విషయాన్ని ప్రపంచానికి నేనే స్వయంగా ప్రకటిస్తాను.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్, అందాల మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, మృణాల్ తన వివాహం, జీవిత భాగస్వామి గురించి చాలా క్లారిటీగా స్పందించినప్పటికీ వార్తలకు చెక్ పడటం లేదు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు మృణాల్ సమాధానమిస్తూ.. ‘‘పెళ్లి అనేది నా జీవితంలో ఒక అందమైన మలుపు. దాన్ని నేను ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ, దానికి రెండు ప్రధానమైన కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సరైన సమయం, రెండు సరైన వ్యక్తి. కేవలం వయసు పెరిగిపోతుందనో లేదా ఎవరో అడుగుతున్నారనో నేను తొందరపడి నిర్ణయం తీసుకోను. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికిన క్షణమే ఆ విషయాన్ని ప్రపంచానికి నేనే స్వయంగా ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ తరం వివాహ బంధాల గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పెళ్లికి మనసులు కలవాలని
‘‘పాత రోజుల్లో పెళ్లి అంటే కుటుంబాల ఒత్తిడి, సామాజిక బాధ్యతగా ఉండేది. కానీ ఇప్పుడు మనం మన సంతోషానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే మనసులు కలవాలని చూస్తున్నారు. బలవంతపు బంధాల కంటే, ఇష్టపూర్వకమైన తోడు కోసం వేచి చూడటమే మేలని అనుకుంటున్నారు. వాళ్లకి నచ్చినప్పుడు నచ్చి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు’’ అని ఆమె అభిప్రాయపడింది. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో చాన్స్ దక్కించుకుంటుంది. త్వరలో ఈ అమ్మడు ‘దో దినావే సెహర్ మే’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతుంది. అలాగే ‘డెకాయిట్’ కూడా విడుదలకు సిద్ధమైంది. మృణాల్, అడివి శేష్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా రాబోతుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో మృణాల్ నటిస్తోంది.






