నాకు అలాంటి సినిమాలు చేయాలని ఉంది: రకుల్ ప్రీత్ సింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-31 09:16:35  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)‘కెరటం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

నాకు అలాంటి సినిమాలు చేయాలని ఉంది: రకుల్ ప్రీత్ సింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)‘కెరటం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి విభిన్న పాత్రలతో ఫిదా చేసింది. ఇటీవల ‘మేరే హస్పెండ్ కి బివి’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana)లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సక్సెస్ అంటే పేరు, డబ్బు కాదు.

మనసుకు నచ్చిన పని చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపడం. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి వచ్చిన డిసిప్లిన్, పంక్చువాలిటీ నన్ను ఎప్పటికీ ఆనందమైన జీవితం వైపుకు తీసుకెళ్తాయని భావిస్తున్నాను. దానివల్లే చేయాల్సిన పనిలో రెండు నిమిషాలు ఆలస్యమైనా నేను ప్యానిక్ అయిపోతాను. సోషల్ ఎంటర్‌టైనర్స్ చేయడం చాలా ఇష్టం. వాటితో సమానంగా సోషల్ రెస్పాన్సిబుల్ సినిమాలు చేయాలని ఉంది. డ్రెస్సింగ్ విషయంలో నాకు కంఫర్ట్‌గా ఉన్న వాటిని ఎంచుకుంటాను. కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించను. ఎదుటు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది వేసుకుంటా’’ అని చెప్పుకొచ్చింది.

Next Story