నాకు తోచింది నేను చేస్తున్నా.. చాలామంది పిచ్చి నా కొడుకులు కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు.. నటుడు సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు(Jagapathi Babu) ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.

నాకు తోచింది నేను చేస్తున్నా.. చాలామంది పిచ్చి నా కొడుకులు కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు.. నటుడు సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు(Jagapathi Babu) ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ హీరోగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు విలన్‌గా అదరగొడుతున్నాడు. వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశం అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’(peddi) మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సలార్-2, సంబరాల ఏటిగట్టు వంటి చిత్రాల్లో కనిపించనున్నాడు. అలాగే కన్నడలో ‘ఎళుమేలి’ మూవీలోనూ నటిస్తున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ విచిత్రమైన పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, జగపతి బాబు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన ఓ ప్రోగ్రాం చేయబోతున్నట్లు వెల్లడించాడు. అలాగే తనను ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చని నెటిజన్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశాడు.

‘‘అందరికీ హాయ్. నమస్తే నేను చెప్పను బోర్ కొట్టేస్తుంది. బాగున్నారా అని కూడా అడగను. ఎందుకంటే.. బాగుంటేనే కదా నా వీడియోను చూస్తారు. బాగున్నారు.. బాగుండాలని నేను కోరుకుంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను మీరందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగులో రాస్తున్నాను. నాకు తోచింది నేను చేస్తున్నాను. కానీ మీ అందరి రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది.. మీ కామెంట్స్ చాలా బాగున్నాయ్. ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ చూస్తున్నాను. కాకపోతే వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మనకి కనెక్షన్ కుదరడం లేదు. అందుకోసం ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నా. మీరు ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. మంచోళ్ళు కాబట్టి మంచి ప్రశ్నలే అడుగుతారని అనుకుంటున్నా. ఏదో తప్పించుకోడానికి కాదు.. కాంట్రవర్సీ వద్దు అని చెబుతున్నా.

ఎందుకంటే చాలామంది పిచ్చి నా కొ*కులు కాంట్రవర్సీ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అందుకే మంచి ప్రశ్నలు అడగండి. ప్రొఫెషనల్‌గా కంటే, పర్సనల్‌గా ఇన్‌స్టాలో నేను బాగానే పైకి వస్తున్నాను. ఇక నుంచి మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి.. వాటికి నేను ఆన్సర్ ఇస్తాను. ఇది జపాన్‌కు కూడా వర్తిస్తుంది. జపనీస్ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా చాలా లవ్ చూపిస్తారు. ఒకరికొకరం కలుసుకొని, ఒకరినొకరం ఎంటర్టైన్ చేసుకుందాం. మీ ఫ్యామిలీలో ఒకరిగా ఉండిపోవాలనేది నా కోరిక. మీ ప్రశ్నల కోసం నేను ఎదురు చూస్తున్నాను. థాంక్యూ అందరికీ బాయ్.. లవ్ యూ ఆల్’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు సోది చెప్పుకుందాం రండి అని వెరైటీ క్యాప్షన్ జత చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు సూపర్ సర్ అని ఆయనకు సపోస్ట్‌గా నిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో

Next Story