- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఇప్పటికీ బాధపడుతున్నా.. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నా: జగపతి బాబు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు(Jagapathi Babu) ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు(Jagapathi Babu) ప్రేక్షకులను అలరించారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి విభిన్న పాత్రలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు ఘాటి, పెద్ది వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa)పేరుతో ఓ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో నాని పాల్గొనగా ఆయన ‘జెర్సీ’(Jersey) మూవీలో పాత్రను మిస్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ‘‘నాని జెర్సీలో ఓ మంచి పాత్రను నేను రిజెక్ట్ చేశాను. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందేమోనన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నా జోస్యం తప్పయింది.నా మొత్తం కెరీర్‌లో నేను పశ్చాత్తాప పడిన సందర్భం ఇదే. అందుకే అప్పటినుంచి నాని హీరోగా చేసినా, నిర్మాతగా వ్యవహరించినా.. ఎంత డబ్బులు ఇచ్చినా సరే అందులో నేను నటించాలని ఫిక్స్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






