నేను ఆమె కళ్ళలో ఒక పట్టుదలను చూశాను.. టాలీవుడ్ హీరోయిన్‌పై సుధా కొంగర ప్రశంసలు

by Mallepaka Hamsa |

కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara)తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti).

నేను ఆమె కళ్ళలో ఒక పట్టుదలను చూశాను.. టాలీవుడ్ హీరోయిన్‌పై సుధా కొంగర ప్రశంసలు
X

దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara)తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti). ఇందులో శివకార్తికేయన్(Sivakarthikeyan), శ్రీలీల(Sreeleela) జోడీగా నటిస్తున్నారు. అలాగే రవి మోహన్ అథర్వ మురళి, ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా శివ కార్తికేయన్ కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆకాశ్ భాస్కరన్‌కు చెందిన డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూ.150 కోట్ల బడ్జెట్‌తో 'పరాశక్తి'ని నిర్మిస్తోంది. పొలిటికల్ డ్రామాగా, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్ జోరు పెంచిన సుధా కొంగర వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు చెబుతోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలపై ప్రశంసలు కురిపించింది. ‘‘శ్రీలీల ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ తమిళం చాలా బాగా నేర్చుకుంది.

ఆమె డ్యాన్సింగ్ క్వీన్. మేకప్ లేకుండా అందాల రంగంలో ఒక ముఖాన్ని చూసి చాలా కాలం అయ్యింది. కానీ శ్రీలీల వైజయంతిమాల లాంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ పరాశక్తి షూటింగ్ సమయంలో, ఆమెకు చివరి మెడికల్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో శ్రీలీల ఉదయం పరీక్షలు పూర్తి చేసి మధ్యాహ్నానికి షూటింగ్ కోసం సెట్‌కు వచ్చింది. నేను ఆమె కళ్ళలో ఒక పట్టుదలను చూశాను. ఆ క్షణమే సినిమాలో ‘రత్నమాల’ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పింది. సుధా కొంగర మాటలు చూస్తే ‘పరాశక్తి’లో శ్రీలీల పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. శివకార్తికేయన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ సినిమా, శ్రీలీలకు కూడా మరో లెవల్ గుర్తింపును తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి భారీ బడ్జెట్, బలమైన కథ, స్టార్ కాస్ట్‌తో ‘పరాశక్తి’ 2026 ప్రారంభంలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Next Story