- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా చేసి తప్పు చేశా నన్ను క్షమించండి నాని.. అసలు విషయం చెప్తూ నటుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్
నేచురల్ స్టార్ నాని (nani), ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) జంటగా నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani), ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) జంటగా నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ(Vivek Atreya) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే ఇందులో ఎస్‌జే సూర్య(SJ Surya) విలన్‌గా నటించగా.. అభిరామి కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీ గత ఏడాది ఆగస్టు 29 థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ఇటీవల ఈ సినిమాకు ప్రతిష్టాత్మక గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇందులో విలన్‌గా నటించిన ఎస్ జే సూర్యకు లభించింది.ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు.
దీనికి ఎస్‌జే సూర్య రిప్లై ఇచ్చినప్పటికీ అది సరిగ్గా ఉండకపోవడంతో ఆయనపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. తాజాగా, ఎస్ జే సూర్య, నానికి క్షమాపణలు చెప్తూ ట్వీ్ట్ చేశారు. ‘‘డియర్ నాని సార్ నన్ను క్షమించండి షూటింగ్ మధ్యలో ఉన్న నేను ఆ ట్వీట్ చేశాను. కాబట్టి అది సరైన ట్వీట్ కాదు చిన్న మిస్టేక్ చేశాను. ధన్యవాదాలు సార్ మీరు, వివేక్ ఆత్రేయ సార్ లేకపోతే అలాంటి అవుపుట్ వచ్చేది కాదు. మీరు స్క్రీన్‌పై మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా హీరోనే. మీ మాటలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






