‘భద్రకాళి’ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా.. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా: తృప్తి రవీంద్ర

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) (శక్తి తిరుమగన్) భద్రకాళి(Bhadrakali) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘భద్రకాళి’ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా.. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా: తృప్తి రవీంద్ర
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) (శక్తి తిరుమగన్) భద్రకాళి(Bhadrakali) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతుంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్, వాగై చంద్రశేఖరం, సునీల్ కృపలానీ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ మూవీతో తృప్తి రవీంద్ర(Trupthi Ravindra) ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె నాటకాల్లో నటించి మెప్పించింది. ఇక నటనపై ఆసక్తితో ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాను విజయ్ నిర్మించడంతో పాటు స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండగా.. సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న తృప్తి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను థియేటర్ నాటకాల ద్వారా శిక్షణ పొందాను. (శక్తి తిరుమగన్) ‘భద్రకాళి’ సినిమాతో కథానాయకిగా పరిచయం కాబోతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఈ మూవీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనీతో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపించింది.

తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించానికి సిద్ధంగా ఉన్నాను. తెలుగులో కూడా నటించాలనుకుంటున్నాను. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇంత మంది అవకాశాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. హైదరాబాద్ వాళ్లు చాలా ఎనర్జటిక్‌గా ఉంటారు. నేను ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story